అర్జీల పరిష్కారానికి పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి పడిగాపులు

Sep 8 2026 12:41 AM | Updated on Sep 8 2026 12:41 AM

● ప్రజావాణిలో బాధితుల మొర పాఠశాలను కాపాడండి భూ ఆక్రమణపై చర్యలేవి?

కరీంనగర్‌ అర్బన్‌: అర్జీ ఇచ్చేందుకు పడిగాపులే.. పరిష్కారానికి పడిగాపులే అని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే తక్షణం పరిష్కారమవుతుందని ఆశిస్తే నెలలు, సంవత్సరాల తరబడి ఎదురుచూపులే దిక్కయ్యాయని వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులే మళ్లీ మళ్లీ రావడం విశేషం. కలెక్టర్‌ చిత్రామిశ్రా అర్జీలు స్వీకరించగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి అర్జీలను స్వీకరించగా మొత్తం 197 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌ వివరించారు.

మా గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను మూసివేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడాల్సిందిపోయి మూసివేస్తే మధ్యలోనే మా చదువులు ఏం కావాలి.? ఉన్న టీచర్లను వేరే పాఠశాలకు బదిలీ చేశారు. ఉన్న బడిలో స్ట్రెంత్‌ పెంచాల్సిందిపోయి పిల్లలు లేరని బడిని మూసేస్తారా.?

– విద్యార్థులు, గ్రామస్తులు, గన్ముకుల, వీణవంక

సర్వే నంబర్‌ 1017, 1018లలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. డీజీపీఎస్‌ ద్వారా సర్వే చేసి ఆక్రమిత భూమిని స్వాఽధీనం చేసుకునే దాకా వదలం.

– గోదాంగడ్డ, భగత్‌నగర్‌ వాసులు, కరీంనగర్‌

మొత్తం అర్జీలు: 197, హౌసింగ్‌: 68

కరీంనగర్‌ మున్సిపల్‌: 29

కలెక్టరేట్‌ డీ సెక్షన్‌: 14,

ఆర్డీవో, కరీంనగర్‌: 13, డీపీవో: 09

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement