మండల కేంద్రంలోని సర్వే నంబర్ 343/9/2/12లో 20గుంటల భూమి ఉంది. 15ఏళ్ల క్రితం కొనుగోలు చేశాం. రికార్డుపరంగా మేమే ఉన్నాం. మా తల్లి ఆరోగ్యం బాగాలేదు, మా చదువులకు ఫీజులు, ఇంటిపై తీసుకున్న రుణానికి సంబంధించిన పలు కారణాలతో భూమిని విక్రయిద్దామనుకుంటే అసైన్డ్ ల్యాండ్‌గా చూపిస్తోంది. – తల్లి,సోదరుడితో సత్య, సైదాపూర్
ఎన్‌హెచ్‌ఎం నోటిఫికేషన్‌కు సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రొగ్రాం కోఅర్డినేటర్ పోస్టు నియామకంలో నకిలీ పత్రాలున్నవారికే ఉద్యోగమిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వ్యక్తిని నియమించడం దేనికి సంకేతం. అన్ని రకాల ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. కలెక్టర్ గారూ చొరవ చూపి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– నగేశ్, కరీంనగర్


