కరీంనగర్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజగోపా ల్ రావు సూచించారు. డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో సోమవారం జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల సూపర్‌వైజర్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరో గ్య కార్యక్రమాల పురోగతి, లక్ష్యాల సాధన, క్షేత్రస్థాయి అమలు, పర్యవేక్షణపై ఆరాతీశారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నివేదికలు, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యులు ఉమాశ్రీ, సనా జవేరియా, విప్లోశ్రీ, హిమబిందు పాల్గొన్నారు.
ఎస్‌ఈగా విజేందర్‌రెడ్డి
కొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈగా ఏ.విజేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండ ఎమ్మార్టీ అండ్ కన్‌స్ట్రక్షన్ విభాగంలో డీఈగా విధులు నిర్వరిస్తున్న విజేందర్‌రెడ్డిని కరీంనగర్ సర్కిల్ ఇన్‌చార్జి ఎస్‌ఈగా బదిలీ చేస్తూ సోమవారం టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సాయంత్రం ఆయన బాధ్యతులు చేపట్టారు. విజేందర్ రెడ్డికి ఉద్యోగులు, వివిధ యూనియన్ల ప్రతినిధులు స్వాగతం పలికారు.
దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టం
కరీంనగర్ టౌన్: కరీంనగర్‌లోని ‘భవిత’ కేంద్రంలో విలీన విద్య రిసోర్స్ పర్సన్లు, ప్రత్యేక ఉపాధ్యాయులకు సోమవారం నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని డీఈవో చైతన్య జైనీ సందర్శించారు. ‘ప్రశస్త’ యాప్ ఆధారిత వీడియోలను ఉపాధ్యాయులు వీక్షించేలా చూడాలని ఆదేశించారు. ఈనెల 21, 22 తేదీల్లో ప్రత్యేక అవసరాల ఉపకరణాల అంచనా క్యాంప్, ఈ నెలాఖరులో జిల్లాస్థాయిలో దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కోఆర్డినేటర్ డి.శ్రీనివా స్, రిసోర్స్ పర్సన్లు లకన్ బాబు, గణేశ్, వెంకటేశ్వరరావు, అట్ల శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధిలో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నగరపాలకసంస్థలో బీజేపీ పాలకవర్గం ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి ఉత్సవం కావడంతో, ఏర్పాట్లపై మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రత్యేకదృష్టి సారించారు. రూ.1.18కోట్ల అంచనా వ్యయంతో ఉత్సవాలు నిర్వహించేందుకు ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. రూ.18 లక్షలతో ఎలక్ట్రికల్ పనుల టెండర్ పూర్తి చేయగా, కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకొన్నారు. ఇక రూ.కోటితో చేపట్టనున్న సివిల్ వర్క్స్ టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. రూ.కోటితో చేపట్టనున్న 83 పనులకు అధికారులు టెండర్ పిలవగా, 60 పనులకు స్పందన లభించింది. మిగతా 23 పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఆ పనులను రీకాల్ చేయనున్నట్లు అధికా రులు తెలిపారు. రూ.కోటితో రోడ్ల ప్యాచ్‌వర్క్‌లు, స్టోన్ డస్ట్, గ్రావెల్ తదితర పనులు చేపట్టనున్నారు. ఎలక్ట్రికల్ పనుల్లో నిమజ్జన పాయింట్ల వద్ద లైట్లు, కూడళ్లకు లైట్లతో అలంకరణ తదితర పనులు చేపడతారు.
వేగవంతంగా ఎస్‌ఐఆర్
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేశామని ఈఆర్‌వో, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. సోమవారం ప్రధాన ఎన్నికల అధికారి సురద్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరపాలకసంస్థ నుంచి కమిషనర్ కరీంనగర్‌కు సంబంధించిన వివరాలు తెలియజేశారు. నిర్దేశిత గడువులోగా నోటీసులు పరిష్కరిస్తామని తెలిపారు. ఏఈఆర్‌వో రాజేశ్ పాల్గొన్నారు.


