రాయికల్: రాయికల్ బల్ది యా పారిశుధ్య కార్మికుడు మహమ్మద్ అజారుద్దీన్ (30) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయం పారిశుధ్య పనులు చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు కోరారు.
విద్యుత్ షాక్‌తో యువకుడు..
వెల్గటూర్: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన సంఘటన వెల్గటూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని ఓ క్రషర్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ బైగా (21)పనిచేస్తున్నాడు. శనివారం క్రషర్‌లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బైగా సోదరుడు చోటు బైగా ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ..
ఫెర్టిలైజర్‌సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 47వ డివిజన్ సంజయ్‌గాంధీనగర్ చెందిన ‘అమ్మ దోశ’ హోటల్ నిర్వాహకురాలు గాదర్ల గౌరమ్మ(78) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఫెర్టిలైజర్‌సిటీ టౌన్‌షిప్‌లో 45 సంవత్సరాలుగా కట్టెల పొయ్యిపై దోశలు తయారు చేయడంలో ఆమె దిట్ట. ప్రతీరోజు వందలాది మంది కస్టమర్లు దోశ తినేందుకు అమ్మ హోటల్‌కు వచ్చేవారు. నిర్వాహకురాలు మృతి చెందడంతో పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


