గోదావరిఖనిటౌన్: పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఆదివారం మంటలు చెలరేగాయి. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి పొగలు రావడంతో స్థానికులు గమనించి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ పి.లక్ష్మీనారాయణ తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికిక చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంలో ఫర్నీచర్ దగ్ధమై రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు ఫైర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. సిబ్బంది శ్రీనివాస్, చందు, దయాకర్, షౌకత్ పాల్గొన్నారు.


