గురువులే భావితరాల రూప శిల్పులు | - | Sakshi
Sakshi News home page

గురువులే భావితరాల రూప శిల్పులు

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

● కరీంనగర్‌ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుదాం ● ఉపాధ్యాయ దినోత్సవంలో కలెక్టర్‌ చిత్రా మిశ్రా

సప్తగిరికాలనీ/కరీంనగర్‌టౌన్‌: గురువులే భావితరాల రూపశిల్పులని కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల రెండో ఇల్లు అని బాల్యం నుంచే పాఠ్యాంశాలతో పాటు శుభ్రత, ధైర్యం, క్రమశిక్షణ నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తాము ఇలాంటి స్థితిలో ఉన్నామంటే, చదువు చెప్పిన ఉపాధ్యాయులే కారణం అన్నారు. అన్ని వృత్తుల వారిని తయారు చేసేది ఉపాధ్యాయులే అని, ఇలాంటి వృత్తిలో ప్రతి నిమిషం బాధ్యతగా పనిచేస్తూ రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సూచించారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ మాట్లాడుతూ నగరపాలక పరిధిలోని పాఠశాలలకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సైన్స్‌ మ్యూజియాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. డీఈవో చైతన్య జైనీ మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. అనంతరం విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించి సన్మానించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ సత్తు మల్లేశం, విద్యాశాఖ ఏడీ ప్రశాంత్‌రెడ్డి, అధికారులు భగవంతయ్య, అశోక్‌రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్‌, దాసి శ్రీనివాస్‌, మహేందర్‌, ఉమారాణి, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement