జ్యోతినగర్: చిన్ననాటి స్నేహం.. గురువుల బోధనలు.. పాఠశాల ప్రాంగణంలో గడిపిన మధుర జ్ఞాపకాలు.. ఎన్నేళ్లు గడిచినా చెరిగిపోవు. ఇలాంటి మధురానుభూతులను మరోసారి నెమరువేసుకుంటూ ఎన్టీపీసీ జిల్లా పరిషత్ పాఠశాలలో 1996–97 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితానికి బాటలు వేసిన రిటైర్డ్ ఎంఈవో డానియల్, ఉపాధ్యాయులు శ్రీధర్, రామారావును సన్మానించారు. పూర్వవిద్యార్థులు మేకల శ్రీధర్, మేకల కుమార్, సలేంద్ర శ్రీనివాస్, జూల విజయ్, బొద్దున శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.


