నకిలీ వైద్యుడి ఘరానా మోసం | - | Sakshi
Sakshi News home page

నకిలీ వైద్యుడి ఘరానా మోసం

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

నకిలీ వైద్యుడి ఘరానా మోసం ● వైద్యం, అప్పు పేరిట రూ.6లక్షలు వసూలు ● ఉడాయించడంతో లబోదిబోమంటున్న బాధితులు

● వైద్యం, అప్పు పేరిట రూ.6లక్షలు వసూలు ● ఉడాయించడంతో లబోదిబోమంటున్న బాధితులు

కథలాపూర్‌(వేములవాడ): అర్హత లేకున్నా.. వైద్యుడిగా చెలామణి అయి.. అనుమతి లేకుండానే ఓ వైద్యశాల ఏర్పాటు చేసి పలువురి నుంచి వైద్యం పేరిట, అప్పుల పేరిట డబ్బులు వసూలు చేసి పరారైన సంఘటన కథలాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా ఊట్నూర్‌కు చెందినట్లు చెబుతున్న ఓ వ్యక్తి కొన్ని నెలల క్రితం కథలాపూర్‌లో ఓ గదిలో ఆయుర్వేద వైద్యశాల ఏర్పాటు చేశాడు. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తామని పలువురిని నమ్మించి చెట్లమూలికలతో వైద్యం అందించాడు. కొందరికి నయమైనా.. ఎక్కువ మంది నయం కాని వారే ఉన్నట్లు తెలిసింది. మండలంలోని వివిధ గ్రామాల వారు పరిచయం కావడంతో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స, మందుల కోసం ముందస్తుగా డబ్బులు చెల్లించాలని కోరడంతో పలువురు చెల్లించారు. చికిత్స కోసం వచ్చినవారిని పరిచయం పెంచుకుని మరికొందరి వద్ద వాహనాలను కుదవ పెట్టి అప్పుగా తీసుకున్నాడు. ఇలా కథలాపూర్‌, సిరికొండ, దూలూర్‌, దుంపేట గ్రామాలతోపాటు వివిధ గ్రామాల ప్రజల వద్ద సుమారు రూ.6 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి వారం రోజులుగా కనిపించడం లేదు. అతడు పరారైనట్లు శనివారం గుర్తించిన బాధితులు లబోదిబోమనడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బైకును నెలవారీగా అద్దెకు తీసుకొని బాధితుల వద్ద కుదవపెట్టినట్లు తెలియడంతో అప్పు ఇచ్చినవారు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వైద్యశాఖ అధికారులు గ్రామాల్లో తనిఖీలు చేపట్టకపోవడంతో విద్యార్హత లేని నకిలీ వైద్యులు చేసిందే వైద్యం అన్నట్లు సాగుతోందన్న విమర్శలున్నాయి. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులతోపాటు క్లీనిక్‌లపై వైద్యశాఖ, పోలీసు శాఖ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

యువకుడి బలవన్మరణం

బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం నీలోజిపల్లికి చెందిన ఎర్ర నాగరాజు(28) ఉరేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఏఎ స్సై గంగరాజు తెలిపారు. నాగరాజు మానసిక స్థితి సరిగా లేక బాధపడేవాడు. జీవితంపై విరక్తితో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement