త్రుటిలో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రమాదం

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

త్రుటిలో తప్పిన ప్రమాదం ● స్కూల్‌ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్‌ బస్సు ● బస్సుల కిటికీ అద్దాలు ధ్వంసం ● సిరిసిల్లలో పలువురు విద్యార్థులకు గాయాలు

● స్కూల్‌ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్‌ బస్సు ● బస్సుల కిటికీ అద్దాలు ధ్వంసం ● సిరిసిల్లలో పలువురు విద్యార్థులకు గాయాలు

సిరిసిల్లటౌన్‌: విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్‌ బస్సును ప్రైవేటు బస్సు ఢీకొట్టిన సంఘటనలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు కొత్తబస్టాండు నుంచి కుడివైపు మలుపు తీసుకుంటుంది. ఇదే సమయంలో అపెరల్‌ పార్కులోని పంక్చువేట్‌, గ్రీన్‌ నీడిల్‌ సంస్థలకు మహిళలను తీసుకెళ్తున్న బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాఠశాలలో పనిచేసే లతిక(ఆయమ్మ)పాటు ఇద్దరు విద్యార్థులు నిత్యశ్రీ, గణేశ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ అనిల్‌, పైలట్‌ రాజు చిన్నారులకు అక్కడే ప్రథమ చికిత్స అందించారు. పెద్దప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement