కరీంనగర్: నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం అన్నారు. ఇందుకు నిరసనగా తెలంగాణచౌక్ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. నాయకులు ఓదెలు, నాగేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌రావు, సంపత్‌రావు పాల్గొన్నారు.


