బావిలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బావిలో పడి వ్యక్తి మృతి

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

చందుర్తి(వేములవాడ): ఓ వ్యక్తి బెల్టుషాపులో మద్యం తాగి నడుచుకుంటూ స్వగ్రామానికి వెళ్తుండగా వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆశిరెడ్డిపల్లెకి చెందిన గసికంటి అశోక్‌ (38) మూడురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లాడు. చుట్టు పక్కల గ్రామాల్లో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం సాయంత్రం తిమ్మాపూర్‌ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. మృతదేహం అశోక్‌దేనని గుర్తించడంతో అక్కడున్నవారు మూడురోజుల క్రితం తిమ్మాపూర్‌ బెల్టుషాపులో మద్యం సేవించాడని ముచ్చటించుకున్నారు. తాగిన మైకంలో ఇంటికి వెళ్లే క్రమంలో బావిలో పడి మృతిచెందాడని చర్చించుకుంటున్నారు. మూడురోజులుగా బావిలో మృతదేహం ఉండడంతో కుళ్లిపోయింది. చందుర్తి పోలీసులకు సమాచారమివ్వగా, అక్కడకు చేరుకుని కుళ్లిన మృతదేహానికి పోస్టుమార్టం చేయించేందుకు చీకటి పడడంతో బుధవారంకు వాయిదా వేశారు.

తాగుడుకు బానిసై

ఆశిరెడ్డిపల్లె గ్రామపంచాయతీలో కార్మికుడిగా పని చేసిన అశోక్‌ తాగుడుకు బానిసయ్యాడు. ఏ పని లేకుండా తాగి తిరగడంతో మూడేళ్ల క్రితం భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం సేవించే వాడని స్థానికులు చెబుతున్నారు. ఏడాది క్రితం మూడురోజుల పాటు కనిపించకుండా పోగా, సిరిసిల్ల పట్టణంలో అశోక్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement