దూసుకెళ్లిన లారీ.. ఇల్లు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన లారీ.. ఇల్లు ధ్వంసం

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

● తప్పిన పెను ప్రమాదం..

తిమ్మాపూర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 8వ డివిజన్‌ అలుగునూర్‌ లో రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి లారీ దూసుకెళ్లదంతో ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. అలుగునూర్‌ లోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌ సమీపంలోని జాప మధు అనే వ్యక్తి ఇంట్లోకి తెల్లవారుజామున భారీలారీ దూసుకెళ్లింది. పెద్దశబ్దం రాకావడంతో కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి ఇల్లుకు ఆనుకుని ఉన్న రేకుల షెడ్డు ధ్వంసమై ఉన్నది. ఘటనలో ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డీజిల్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించడంతో గ్రామస్తులు అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ. 8 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు మధు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement