వేములవాడ: భీమేశ్వరస్వామిని మంగళవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబునాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భీమేశ్వర వసతి గృహం వద్దకు చేరుకున్న చైర్మన్‌కు పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేదాశీర్వచనం అందజేశారు. డీఈవో ప్రతాప నవీన్ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేసి సత్కరించారు. టౌన్ సీఐ వీరప్రసాద్, పీఆర్వో పెరుక శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు రాజేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


