వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

వేములవాడఅర్బన్‌: వేములవాడ మండలం చింతాల్‌ఠాణా గ్రామంలో వృద్ధురాలు రోమాల మల్లవ్వ మెడలోని 3 తులాల పుస్తెలతాడును దొంగ లాక్కెల్లినట్లు బాధితురాలు తెలిపింది. వివరాలు.. సోమవారం రాత్రి మల్లవ్వ పక్కింటిలోని బంధువుల ఇంట్లో పడుకుంది. మంగళవారం ఉదయం 5 గంటలకు ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లగా ఓ దొంగ ఇంట్లోకి చొరబడి మల్లవ్వపై దాడి చేసి మెడలోని పుస్తెలతాడు లాక్కెళ్లాడు. దాడిలో వృద్ధురాలి నోటికి తీవ్రగాయాలు కావడంతో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement