ఎస్‌జీఎఫ్‌ సంబురం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ సంబురం

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

● నగరంలో అండర్‌–14,17,19 క్రీడలకు ఏర్పాట్లు ● 16 నుంచి 19వరకు అండర్‌–14, 17 జిల్లాస్థాయి పోటీలు ● త్వరలోనే అండర్‌–19 షెడ్యూల్‌

● నగరంలో అండర్‌–14,17,19 క్రీడలకు ఏర్పాట్లు ● 16 నుంచి 19వరకు అండర్‌–14, 17 జిల్లాస్థాయి పోటీలు ● త్వరలోనే అండర్‌–19 షెడ్యూల్‌

కరీంనగర్‌స్పోర్ట్స్‌: పాఠశాలస్థాయి నుంచి ప్రారంభమయ్యే క్రీడా ప్రయాణం మండలం దాటి జిల్లా వేదికకు చేరితే అక్కడి నుంచి రాష్ట్రం, జాతీయ స్థాయికి దూసుకెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. అలాంటి క్రీడా ప్రతిభకు మరోసారి కరీంనగర్‌ వేదిక కానుంది. 70వ జిల్లాస్థాయి పాఠశాలల, కళాశాలల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్‌) క్రీడా పోటీల షెడ్యూల్‌ ఖరారైంది. సెప్టెంబర్‌ 16 నుంచి 19 వరకు కరీంనగర్‌లోని అంబేద్కర్‌ స్టేడియంలో అండర్‌–14,17 బాలబాలికల విభాగాల్లో వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించనున్నారు. అండర్‌ 19 షెడ్యూల్‌ త్వరలోనే విడుదల కానుంది.

క్రీడా మైదానం నుంచి.. భవిష్యత్‌ విజేతల వరకు

కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియం మరోసారి యువ క్రీడాకారుల ఉత్సాహానికి వేదిక కానుంది. మండలస్థాయిలో మొదలయ్యే పోరాటం జిల్లా స్థాయిలో మరింత ఉత్కంఠను రేపనుంది. కబడ్డీ రైడ్‌లు, ఖోఖో పరుగులు, వాలీబాల్‌ స్మాష్‌లతో స్టేడియం మళ్లీ క్రీడా సందడికి సిద్ధమైంది. జిల్లాస్థాయి పోటీలను సెప్టెంబర్‌ 16 నుంచి 19 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 16న అండర్‌–17 బాలికల పోటీలు నిర్వహించనున్నారు. 17న అండర్‌–14 బాలికల విభాగంలో పోటీలు జరగనున్నాయి. 18న అండర్‌–17 బాలురకు, 19న అండర్‌–14 బాలురకు పోటీలు జరుగనున్నాయి.

ఒకే సంస్థ తరుపన పోటీలకు

ఎస్జీఎఫ్‌ పోటీలకు ఈ సంవత్సరం హాజరయ్యే సీబీఎస్‌ఈ, గురుకులాల, మైనారిటీ, తదితర పాఠశాల విద్యార్థులకు కొత్తగా నిబంధనలు తీసుకొచ్చారు. ఎస్జీఎఫ్‌ పోటీలకు హాజరయ్యే విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాల్‌లు ఇచ్చిన అనుమతి పత్రంతో హాజరుకావాలి. ఎస్జీఎఫ్‌ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు మరేయితర పోటీలు సీబీఎస్‌ఈ, మైనారిటీ, గురుకులాల క్రీడల్లో పాల్గొనవద్దు. వారి సంస్థల ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఎస్జీఎఫ్‌ పోటీల్లో పాల్గొనలేకుండా నిబంధనలు తీసుకొచ్చారు. అదే విధంగా ఒక వయస్సు విభాగంలో పాల్గొన్న క్రీడాకారులు అదే కేటగిరీలో పాల్గొనాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement