కురిక్యాలలో పట్టపగలు చోరీ | - | Sakshi
Sakshi News home page

కురిక్యాలలో పట్టపగలు చోరీ

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

కురిక్యాలలో పట్టపగలు చోరీ

గంగాధర: తాళం వేసి ఉన్న ఇంట్లోకి దొంగలు నగదు, బంగారం అపహరించిన సంఘటన గురువారం మధ్యాహ్నం మండలంలోని కురి క్యాల గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మీస మహేందర్‌, స్రవంతి దంపతులు పిల్లలను పాఠశాలకు పంపించి, ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం గుర్తుతెలి యని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.75 వేల నగదు, తులంపావు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అనంతరం ఎదురుగా ఉన్న ఒగ్గరి మల్ల య్య ఇంటి తాళం కూడా పగలగొట్టేందుకు ప్రయత్నించగా.. చప్పుడు రావడంతో స్థానికు డు ఖాలిక్‌ ప్రశ్నించాడు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న ఎస్సై వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇసుక టిప్పర్‌ పట్టివేత

ఇబ్రహీంపట్నం: మండలంలోని అమ్మక్కపేట వద్ద గురువారం ఇసుక టిప్పర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. కథలాపూర్‌ మండలం నుంచి అమ్మక్కపేటకు అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తుండగా టిప్పర్‌ను పట్టుకున్నామని పేర్కొన్నారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి టిప్పర్‌ యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వృద్ధుడి ఆత్మహత్య

కోనరావుపేట(వేములవాడ): ఒంటరితనం భరించలేక ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రామన్నపేటకు చెందిన నేతుల రాజయ్య(80) సుతారి కార్మికుడిగా పనిచేసేవాడు. రాజయ్య భార్య లచ్చవ్వ, కుమారుడు దశరథం కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లకు వివాహం చేసిన రాజయ్య కొంతకాలంగా ఒంటరితనంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి గ్రామశివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా సర్పంచ్‌ లక్ష్మి భర్త రాజశేఖర్‌రెడ్డి అడ్డుకొని ఇంటికి పంపించాడు. మళ్లీ గురువారం తెల్లవారుజామున గ్రామశివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

మెట్‌పల్లిరూరల్‌: ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడిన మెట్‌పల్లి మండలం మేడిపల్లికి చెందిన బోదాసు చిన్నరాజయ్య(35) చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌కు చెందిన చిన్న రాజయ్య మేడిపల్లిలో అద్దెకు ఉంటున్నాడు. ఈనెల ఒకటిన భార్య రాధతో చిన్నరాజయ్య గొడవ పెట్టుకుని రోడ్డుపైకి రాగా ఆటో ఢీకొట్టింది. చికిత్స నిమిత్తం మెట్‌పల్లి.. తరావ్త జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. మృతుడి సోదరుడు పెద్ద రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement