బీజేపీ నాయకుల నిరసన | - | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకుల నిరసన

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

కరీంనగర్‌: నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంతో పాటు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌ రెడ్డి నివాసంపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడిచేసి, సంత్‌ రవిదాస్‌ చిత్రపటంపై నల్ల సిరా చల్లడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గురువారం జిల్లావ్యాప్తంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చొప్పదండి కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ... దాడులు చేసిన వారిని వదిలేసి పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేయడంపై మండిపడ్డారు.

తిమ్మాపూర్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం...

బీజేపీ తిమ్మాపూర్‌ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఇనుకొండ నాగేశ్వర్‌ రెడ్డి, చింతం శ్రీనివాస్‌, ఎలుకపెల్లి స్వామి, బొంతల కల్యాణ్‌ చంద్ర, బుట్ల శ్రీనివాస్‌, మువ్వరపు సంపత్‌, తిరుపతిరెడ్డి, బోనాల మోహన్‌, గడ్డం అరుణ్‌, దుర్షేడ్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement