‘నేరెళ్ల’కు మరో చాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

‘నేరెళ్ల’కు మరో చాన్స్‌

Sep 4 2026 2:06 AM | Updated on Sep 4 2026 2:06 AM

● మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రెండోసారి నియామకం

● మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రెండోసారి నియామకం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా జిల్లాకు చెందిన నేరెళ్ల శారద నియామకమయ్యారు. ఇప్పటివరకు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న గద్వాల విజ యలక్ష్మి రాజీనామా చేయడం, నేరెళ్ల శారదను ఆ స్థానంలో నియమించడం, మారిన రాష్ట్ర రా జకీయాల నేపథ్యంలో చకచకా జరిగిపోయా యి. రామడుగు మండలం వెదిరకు చెందిన శారద మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియామకం కావడం ఇది రెండోసారి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చైర్‌పర్సన్‌ పదవి వరించింది. పదవీ కాలం ముగియడంతో ఆమె స్థానంలో విజయలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. గురువారం తాజాగా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా శారదను నియమించడం రాజకీయవర్లాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అంతరాయం లేకుండా నీటి సరఫరా

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో అంతరా యం లేకుండా నీటి సరఫరా చేయాలని కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. గురువారం నగరంలోని ఫిల్టర్‌బెడ్‌ను సందర్శించారు. నీటి సంపులు, సరఫరా చేసే మోటారు పంపుల పనితీరును తనిఖీ చేశారు. క్లోరినేషన్‌ ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, తాగునీటి నాణ్యతలో లోపాలు రాకుండా చూడాలన్నారు.డీఈ దేవేందర్‌ రెడ్డి, ఏఈ భీంవర్ధన్‌రెడ్డి, ఫిల్టర్‌బెడ్‌ ఇన్‌చార్జ్‌ అజయ్‌ పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో లీవ్‌లు

విధుల్లో పారదర్శకత కోసం లీవ్‌ మేనేజ్మెంట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తెలిపారు. పేపర్‌ ద్వారా కాకుండా మొబైల్‌లో లీవ్‌ మేనేజ్మెంట్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మొబైల్‌ ద్వారా ఉద్యోగి రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఓటీపీ ద్వారా లాగిన్‌ అయి, పోర్టల్‌లో సెలవుల దినాలు నమోదు చేసి సంబంధిత హెడ్‌ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

విద్యుత్‌ స్తంభాలపై కేబుళ్ల క్రమబద్ధీకరణకు చర్యలు

కొత్తపల్లి (కరీంనగర్‌): కరీంనగర్‌ టౌన్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ స్తంభాలపై కేబుళ్ల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని డీఈ జంపాల రాజం తెలిపారు. కరీంనగర్‌లోని విద్యుత్‌ భవన్‌లో గురువారం నగరంలోని కేబుల్‌ టీవీ, ఫైబర్‌ నెట్‌వర్క్‌, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో సమావేశమయ్యారు. విద్యుత్‌ స్తంభాలపై ఏర్పాటు చేసిన అన్ని కేబుళ్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. ప్రతి విద్యుత్‌ స్తంభాన్ని ఏఏ సంస్థలు వినియోగిస్తున్నాయో పోల్‌ యు టిలైజేషన్‌ చేయడానికి షెడ్యూల్‌ జారీ చేశామన్నారు. కేబుల్‌ టీవీ, ఫైబర్‌ నెట్‌వర్క్‌, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ కేటాయించిన షెడ్యూల్‌ ప్రకారం సహకరించాలని కోరారు.

విజ్ఞాన యాత్రకు దివ్యాంగ విద్యార్థులు

కరీంనగర్‌టౌన్‌: జిల్లాలోని భవిత కేంద్రాల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులను గురువారం విజ్ఞానయాత్రకు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్‌ మ్యూజియం, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, అంబేద్కర్‌ విగ్రహం తదితర ప్రాంతాలు సందర్శించారు. యాత్రను డీఈవో చైతన్య జైనీ జెండా ఊపి ప్రారంభించారు.

ఇన్‌చార్జి డీఏవోగా ఛత్రు నాయక్‌

కరీంనగర్‌ అర్బన్‌: ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారిగా ఛత్రునాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. డీఏవో భాగ్యలక్ష్మి ఉద్యోగ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఛత్రునా యక్‌ ఆత్మ పీడీగా వ్యవహరిస్తుండగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement