హుజూరాబాద్: స్మార్ట్‌ఫోన్ల వ్యసనంతో నేటితరం పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని, 16ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా వినియోగంపై నిషేఽ దం విధించాలని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శనివారం హుజూరాబా ద్‌లో మాట్లాడుతూ నల్గొండ తదితర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు సెప్టెంబర్‌లో అన్ని జిల్లా కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొందరు మొబైల్స్ మోజులో మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల ఉచ్చులో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ దుష్ప్రభావంతో యువతలో ద్వేషభావం, విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలో చనలు, హింసాత్మక ప్రవత్తి పెరుగుతున్నాయన్నారు. రాత్రింబవళ్లు ఫోన్‌కు అ తుక్కుపోవడంతో నిద్రలేమి, కంటిచూపు మందగించడం వంటి అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ఆన్‌లైన్ వేధింపులు కూడా భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయన్నారు. పిల్లల అలవాట్లు, స్క్రీన్ సమయంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, హానికర డిజిటల్ కంటెంట్‌పై కఠిన చట్టాలు తేవాలన్నారు. ఏపీ, కర్ణాటకలను ఆదర్శంగా తీసుకుని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సోషల్ మీడియా నిషేధంపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.


