ఫీజు బకాయిలపై బీజేపీ నిరసన | - | Sakshi
Sakshi News home page

ఫీజు బకాయిలపై బీజేపీ నిరసన

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

కరీంనగర్‌: విద్యార్థుల ఫీజు బకాయిల సమస్యపై బీజేపీ ఆధ్వర్యంలో శనివా రం గీతా భవన్‌ చౌరస్తా వద్ద చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం నేతృత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలను ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిల విడుదల చేయాలన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విడిచి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నాయకులు బాస సత్యనారాయణరావు, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, మాడ వెంకట్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, గుర్రాల వెంకట్‌రెడ్డి, ఎర్రబెల్లి సంపత్‌రావు, వేణు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement