● కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌రూరల్: కరీంనగర్‌లో 22–ఎ నిషేధిత భూముల సమస్య పరిష్కార బాధ్యత తనదేనని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పేర్కొన్నారు. కొత్తపల్లిలోని వెలిచాల నివాసంలో శుక్రవారం 22–ఎ బాధితులతో సమావేశమయ్యారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి నుంచి బాధితులు హాజరయ్యా రు. సుమారు 140 సర్వే నంబర్లలో వేయి ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లినట్లు బాధితులు తెలిపారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని రాజేందర్‌రావు హామీ ఇచ్చారు. కలెక్టర్ చిత్రామిశ్రా ఈ అంశంపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, వరాల నరసింగం, గుమ్మడి రాజకుమార్, ఇక్రమ్ సికిందర్, పడాల శ్రీజ, సుధగోని మాధవి పాల్గొన్నారు.
22–ఎ బాధితులకు న్యాయం చేయండి
కరీంనగర్‌లో 22ఏ నిషేధిత భూముల జా బితాలో ఉన్న భూముల బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని వెలిచాల రాజేందర్‌రావు శుక్రవారం జగిత్యాలలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
22–ఎ అక్రమాలపై విచారణ జరిపించాలి
కరీంనగర్: తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 22–ఎ జాబితా అక్రమాలపై విచారణ జరపాలని, ఈ తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సాయిని మల్లేశం మాట్లాడుతూ 22–ఎ నిషేధిత భూముల జాబితాలో జరిగిన భారీ అవకతవకలను కేవలం పరిపాలనా తప్పిదంగా కాకుండా, ఒక వ్యవస్థీకృత కుట్రగా పరిగణించి న్యాయ విచారణ జరిపించాలన్నారు. భూభారతి పోర్టల్‌లో గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు జరిగిన మార్పులు, చేర్పులపై డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు. జిల్లాలోని 22ఏ భూముల వివరాలను మండలం, గ్రామం, సర్వే నంబర్ల వారీగా బహిర్గతం చేసి పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మేయర్ కొలగా ని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, నాయకులు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, మాడవెంకటరెడ్డి, కన్న కృష్ణ, రంగు భాస్కరాచారి, బోయినపల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.
న్యాయవాదులకు హెల్త్‌కార్డులు పంపిణీ
కరీంనగర్ క్రైౖం: రాష్ట్ర అడ్వొకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను శుక్రవారం పంపిణీ చేశారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ న్యాయవాదులకు కార్డులు అందజేశారు. తొలి కార్డును మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది ఆరెపల్లి మోహన్ స్వీకరించారు. అనంతరం 629మంది న్యాయవాదులకు కార్డులు అందించారు. ఈ పథకం ద్వారా న్యాయవాదితో పాటు మొత్తం నలుగురికి ఆరోగ్య బీమా సదుపాయం అందనుందని తె లిపారు. రూ.2లక్షల విలువైన ప్రమాద బీమా సదుపాయం వర్తించనున్నట్లు వెల్లడించారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: నూతన లైన్, డీటీఆర్ పనుల నిమిత్తం శనివారం ఉదయం 10 నుంచి 12గంటల వరకు 11 కేవీ శివనగర్ ఫీడర్ పరిధిలోని సప్తగిరికాలనీ, శివనగర్, ప్రగతినగర్, బతుకమ్మ కాలనీ, మార్కండేయనగర్ ప్రాంతాలతో పాటు మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు సీసీ, ఆటోనగర్ ఫీడర్ల మధ్య ఇంటర్ లింక్ లైన్ పనుల కారణంగా ఈపీఎఫ్ ఆఫీస్, ఎల్‌ఐసీ ఆఫీస్, స్టేడియం, భగత్ నగర్, గౌతమినగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.


