గన్నేరువరం: ‘మండలంలోని గుండ్లపల్లి నుంచి ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు చేస్తావా లేక ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేస్తావా’ అని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న అధ్వర్యంలో శుక్రవారం గన్నేరువరం నుంచి గుండ్లపల్లి స్టేజీ వరకు చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో డబుల్ రోడ్డు పనులు పూర్తి చేస్తానన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 33 నెలల్లో కూడా పూర్తి చేయలేకపోయాని మండిపడ్డారు. డబుల్‌రోడ్డు పనులకు నిధులు తీసుకరాలేక, కాంట్రాక్టర్ సమర్థతను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్‌ను మార్చడం కాదని, ఎమ్మెల్యేనే మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారా వు, మాజీ జెడ్పీటీసీలు రవీందర్‌రెడ్డి, సిద్దం వేణు, శేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, లక్ష్మణ్, ఆంజనేయులు, విక్రమ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సుధాకర్, శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు.
సీఎం సార్ రోడ్డు పూర్తి చేయండి:
శ్వేతాన్షి వీడియో వైరల్
గుండ్లపల్లి– ఇల్లంతకుంట రోడ్డు ఇబ్బందులపై జంగపల్లి గ్రామానికి చెందిన మూడోతరగతి విద్యార్థి శ్వేతాన్షి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘గుడ్ మార్నింగ్ ఎవ్‌రీ వన్’ అని అంటూ మొదలుపెట్టి.. రోడ్డుతో పడుతున్న ఇబ్బందులను వివరించింది. తమకు రోడ్డు కావాలని, స్కూల్‌కి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాని తెలిపింది. తమ భవిష్యత్‌ను దృష్టి ఉంచుకుని రోడ్డు పనులు పూర్తి చేయాలి సీఎంసార్ అంటూ కోరింది.


