ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి

Aug 22 2026 2:17 AM | Updated on Aug 22 2026 2:17 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి చేపడుతున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం 2వ డివిజన్‌లో నగరపాలకసంస్థ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 12వ డివిజన్‌ విఘ్నేశ్వర కాలనీలో యూఐడీఎఫ్‌ నిధులతో చేపట్టనున్న అభివృద్ధిపనులను ప్రారంభించారు. మేయర్‌ మాట్లాడుతూ నగరంలోని 66 డివిజన్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామన్నారు. డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ చొప్పరి జయశ్రీ వేణు, అర్బన్‌ బ్యాంక్‌చైర్మన్‌ గడ్డం విలాస్‌రెడ్డి పాల్గొన్నారు.

డీఈపై చర్య తీసుకోవాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ డీఈ శ్రీనివాస్‌పై చర్యతీసుకోవాలని ఓ మహిళా కార్పొరేటర్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. మహిళా కార్పొరేటర్‌ అయిన తనను కించపరిచేవిధంగా డీఈ వ్యవహరించారని, చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement