ఎస్‌టీపీల నిర్వహణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌టీపీల నిర్వహణకు చర్యలు

Aug 22 2026 2:17 AM | Updated on Aug 22 2026 2:17 AM

● నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలక సంస్థ మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ సీడీఎంఏ కార్యాలయం నుంచి మున్సిపల్‌ పరిపాలనాధికారి శ్రీదేవి కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ నుంచి కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపల్‌, పురపాలక, నగరపాలక సంస్థల్లోని మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రాల నిర్వాహణ, పనితీరు, సమస్యలు, సంపూర్ణ సామర్థ్యంతో నిర్వహణ రాకపోవడానికి గల కారణాలు, వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సీడీఎంఏ సుదీర్ఘంగా చర్చించారు. నగరపాలక సంస్థ ఎస్‌టీపీ నిర్వహణ, సమస్యలు, ప్రస్తుతం జరుగుతున్న మురుగు నీటి శుద్దీకరణ విధానం, పునర్వినియోగం, వాటర్‌ ప్లస్‌ హోదా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టం పనితీరు, పెండింగ్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టం, తదితర విషయాలను కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ వివరించారు. నగరంలోని ఎస్‌టీపీ ద్వారా మురుగు నీటిని సామర్థ్యం మేరకు శాసీ్త్రయంగా శుద్ధి చేసి, నీటిని వనమహోత్సవం మొక్కలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఇప్పటికే వాటర్‌ ప్లస్‌ హోదాను సాదించిందన్నారు. ప్రస్తుతం విడుదలైన అమృత్‌ స్కీం నిధులతో పెండింగ్‌ యూజీడీ పనులు త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈఈ లచ్చిరెడ్డి, డీఈ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement