ట్రాక్టర్‌ బావిలో పడి డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బావిలో పడి డ్రైవర్‌ మృతి

Aug 22 2026 1:53 AM | Updated on Aug 22 2026 1:53 AM

ఖానాపూర్‌: వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్‌ బావిలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం పెంబి పోలీసుస్టేషన్‌ పరిధిలోని బావాపూర్‌(ఆర్‌) గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై హనుమాండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్‌కు చెందిన గంగాధర్‌ ఓ ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బావాపూర్‌(ఆర్‌) గ్రామంలో వరి నాట్లకు ముందు కేజ్‌వీల్‌తో పనులు చేస్తుండగా ట్రాక్టర్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్‌తోపాటు బావిలో పడిపోయాడు. గంగాధర్‌(43) నీట మునిగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన ఇద్దరు భార్యలు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement