● రాజన్న భక్తుల నగదు కష్టాలకు చెక్ ● వారం పాటు ట్రయల్ రన్ ● త్వరలోనే అన్ని విభాగాల్లో అమలు
వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఆలయంలో దేనికై నా నగదు చెల్లింపులు చేయాల్సిందే. ఈక్రమంలో వారు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. భక్తుల ఇబ్బందులను గుర్తించి ఆలయ అధికారులు త్వరలోనే డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తేనున్నారు. హుండీ కానుకల లెక్కింపులో కూడా డిజిటల్ డివైజ్‌ల వాడకాన్ని పరిశీలిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే ఆలయ అధికారులు, బ్యాంక్ ప్రతినిధులతో చర్చిస్తున్నారు.
నగదు సమస్యకు చెక్
రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు నగదు కోసం ఏటీఎంల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నా యి. ఈ సమస్యను అధిగమించడానికి ఆలయ ఈవో రమాదేవి డిజిటల్ చెల్లింపులను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అన్ని రకా ల సేవలకు డిజిటల్ చెల్లింపులను ప్రారంభించనున్నారు. క్యూఆర్ కోడ్ స్కానర్లు, పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ప్రొటోకాల్ కార్యాలయంలో లాంఛనంగా ఏర్పాటు చేసి వారం రోజుల ట్రయల్ తర్వాత అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తేనున్నారు. వీటి ఏర్పాటుతో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ, పోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది.


