విద్యానగర్(కరీంనగర్)/కోరుట్ల: : కోరుట్ల డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ.మదార్ గతేడాది జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స సమయంలో ఒకకాలును తొలగించారు. అతడికి యూనియన్ బ్యాంక్‌లో సూపర్ సాలరీ అకౌంట్ ఉన్నందున ఆర్టీసీ యాజయాన్యం బ్యాంక్ ద్వారా రూ.50 లక్షల బీమా చెక్కు మంజూరు చేసింది. సోమవారం ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి హైదరాబాద్ బస్ భవన్‌లో చెక్కు అందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) సీహెచ్. వెంకన్న, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ) కె. రాజశేఖర్, ఫైనాన్సియల్ అడ్వైజర్ విజయ పుష్ప, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషాదేవి, కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి.రాజు, కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్, బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.రవీంద్రబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సత్యనారాయణ బాబ్లీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రంజన్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు.
స్వగ్రామానికి చేరిన వలసజీవి మృతదేహం
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాలకు చెందిన గెరిగంటి శ్రీహరి(45)ఒమన్‌లో పది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా అతని మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరింది. పదేళ్లుగా ఒమన్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. కంపెనీ జీతాల విషయంలో ఇబ్బందులు పెట్టడంతో అత్యవసర సెలవుపై స్వదేశానికి వచ్చి మూడు నెలల క్రితం ఒమన్‌కు వెళ్లాడు. గతంలో పనిచేసిన కంపెనీకి సమాచారం ఇవ్వకుండా మరో కంపెనీలో పనిచేశాడు. ఈక్రమంలో గత నెల 29న గుండెపోటుతో మృతిచెందాడు. చట్టవిరుద్ధంగా వేరే కంపెనీలో పనిచేయడంతో మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు పాలాజీ శ్రీనివాస్, దేవరాజులకు తెలపడంతో వారు భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. శ్రీహరి మృతదేహం ఇంటికి వచ్చే చర్యలు తీసుకున్నారు.
ఆస్తి కోసం వేధింపులు.. మహిళ బలవన్మరణం
మెట్‌పల్లి: ఆస్తికోసం వేధించడంతో భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెట్‌పల్లిలో జరిగింది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. కా మారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్‌కు చెందిన వీరమణి(40)కి భర్త, కుమారుడు ఉండగా.. వారు కొంతకాలం క్రితం మృతిచెందారు. ఒంటరి గా ఉంటున్న ఆమెను తన సోదరి అయిన మెట్‌పల్లి లోని గాజులపేటలో నివాసముంటున్న జక్కం గంగమణి–రాజు దంపతులు చేరదీశారు. అనంతరం వీరమణికి ఆస్తి ఉండడంతో దానిని తామే దక్కించుకోవాలన్న ఉద్దేశంతో రాజు ఆమెను నమ్మించి వివా హం చేసుకున్నాడు. తర్వాత రాజు, గంగమణి కలి సి ఆస్తిని తమకు రాసివ్వాలని వేధిస్తూ వస్తున్నారు. 8న గొడవ కాగా.. వీరమణి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఆమె అచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినా లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం శివారులోని జక్కం రాజుకు చెందిన వ్యవసాయ బావిలో మహిళ శవం కనిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. వారు అక్కడకు మృతదేహాన్ని పరిశీలించి వీరమణిగా గుర్తించారు. మృతురాలి సోదరుడు బాలరాజు ఫిర్యాదు మేరకు మృతికి కారుకులైన రాజు, గంగమణిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


