వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి ఏం జరుగుతుందో.. ఎవరికి అనుమతి ఇవ్వడం లేదని.. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం గుడిని నిర్మిస్తున్నామంటూనే.. ఆగమాగం చేస్తున్నారన్నారు. వేములవాడలోని పద్మశాలీ భవనంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధి పేరుతో గర్భగుడిని టచ్‌చేస్తే శ్రావణమాసంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల సందర్భంగా ప్రవర్‌పాయింట్ ప్రజంటేషన్‌లో చెప్పింది వేరని.. ఇప్పుడు చేస్తుంది వేరన్నారు. అభివృద్ధికి తాము అడ్డుకాదని, మొదట్లో చెప్పిన ప్రకారం పనులు చేయాలని కోరారు. రాజన్న ఆలయ విస్తరణ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాపెల్లి శ్రీధర్, రేగుల మల్లికార్జున్, కుమ్మరి శంకర్, మైలారం శ్రీనివాస్, కొండ్లెపు ముత్యం, సంటి మహేశ్, రాహుల్, పిన్నింటి హన్మండ్లు, సగ్గు శేఖర్ తదితరులు ఉన్నారు.
శ్రావణమాసంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ


