1,79,879 | - | Sakshi
Sakshi News home page

1,79,879

Aug 9 2026 1:52 AM | Updated on Aug 9 2026 1:52 AM

సర్‌.. 83.46శాతం పూర్తి

ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం

ప్రత్యేక పరిశీలనకు 2,09,443 ఓట్లు

ఇక మిగిలేది 9.09లక్షల ఓట్లేనా?

అక్టోబర్‌ 10తో తేలనున్న తుది జాబితా

ఓట్లు ఔట్‌!

సర్‌ ప్రక్రియలో భాగంగా జూన్‌ 25 నుంచి ఈ నెల 3వరకు ఇంటింటా ఓటర్ల పరిశీలన, ఫారాల పంపిణీ, సేకరణ జరగగా పోలింగ్‌ స్టేషన్‌ రేషనలైజేషన్‌ ఈ నెల 3లోపు చేపట్టారు. సోమవారం ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. అందులో అన్‌కలెక్టబుల్‌ ఫామ్స్‌ కాలమ్‌లో లక్షన్నర ఓట్లకు పైగా ఓటర్లను చూపించడం విశేషం. 1,79,879 ఈఎఫ్‌లు అన్‌కలెక్టబుల్‌గా నమోదయ్యాయి. మొత్తం ఓటర్లతో పోలిస్తే ఇది 16.52 శాతం. 12,332 మంది ఓటర్ల వివరాలు ఏఎస్‌డీ జాబితాలో నమోదయ్యాయి. ఇది మొత్తం ఓటర్లలో 1.13 శాతం. ఇంట్లో వ్యక్తి లేకపోవడం, చిరునామాలో వ్యక్తి అందుబాటులో లేకపోవడం, ఫారం తిరిగి అందకపోవడం, ఇతర సమస్యలుగా అధికారులుగా చెబుతున్నారు. ఇక అనొమలిస్‌ కాలమ్‌లో 2,09,443 ఓట్లను గుర్తించారు. మొత్తం ఓటర్లలో ఇది 19.23శాతం. 7,178 మంది ఓటర్లకు సంబంధించిన డీఎస్‌ఈ నమోదైంది. ఈ వివరాలను అధికారులు పరిశీలించి, అవసరమైన చోట సవరణలు చేపట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఫారాల డిజిటలైజేషన్‌, వెరిఫికేషన్‌ పనులు జిల్లాలో 83 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు, బీఎల్‌వోలు కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల మిస్‌మ్యాచ్‌, వివరాలు పొంతన లేకపోవడం, ప్రత్యేకంగా పరిశీలించాల్సినవిగా ఎన్నికల విభాగం అధికారి వివరించారు.

ఓటర్లు తస్మాత్‌ జాగ్రత్త..

ఓటర్లు అప్రమత్తంగా లేకుంటే భారీ నష్టం జరిగే అవకాశముంది. ఓటరు ఇక్కడే ఉండి ఓటరు జాబితాలో పేరు లేకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవనున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 10న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించనుండగా ఓటర్లు కచ్చితంగా జాబితాలో తమ పేరుందో లేదో చూసుకోవాల్సిందే. లేకుంటే తదుపరి ఓటరుగా నమోదు కావాలంటే ఇబ్బందితో కూడుకున్న పని.

మొత్తం బీఎల్‌వోలు: 1,338

మొత్తం ఓటర్లు: 10,89,090

సగటున బీఎల్‌వోలు పరిశీలించిన ఓట్లు: 814

ఓటరు ఫాం పంపిణీ చేసినవి: 10,89,090

డిజిటైజ్‌డ్‌ చేసిన ఫామ్స్‌: 9,09,205

డిజిటైజ్‌డ్‌ కానివి: 06

తేడాలు,లోపాలుఉన్న ఓటర్ల సంఖ్య: 12,332

ఫామ్స్‌ సేకరించలేని కేసులు: 1,79,879

డేటాలో గుర్తించిన తేడాలు: 2,09,443

సర్‌ షెడ్యూల్‌

ముసాయిదా జాబితా ప్రకటన:

ఆగస్టు 10

ఫిర్యాదులు, అభ్యంతరాలు:

ఈ నెల 10నుంచి సెప్టెంబర్‌ 9వరకు

నోటీసుల జారీ, పరిశీలన:

ఈ నెల 10నుంచి అక్టోబర్‌ 10

తుది ఓటరు జాబితా:

అక్టోబర్‌ 12, 2026

జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. మొత్తం ఓట్లలో 15శాతానికి పైగా తగ్గడం ఖాయమనిపిస్తోంది. ఇన్నాళ్లు ఉన్నవి బోగస్‌ ఓట్లా, డబుల్‌ ఓట్లా అన్న ది అనుమానమే. సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 10న ప్రకటించనుండగా దాదాపు ఖరారైంది. ఫారమ్స్‌ కలెక్ట్‌ చేయలేని వాటి సంఖ్య 1,79,879 ఉండటం గమనార్హం. అంటే సదరు ఓట్లు జాబితా నుంచి తొలగించడం లాంఛనమే. ఎన్నికల సంఘం మాత్రం అన్‌కలెక్టబుల్‌ ఫామ్స్‌గా కాలమ్‌లో సూచించింది. తదుపరి వెరిఫికేషన్‌ ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఓట్లు తొలగించినట్లేనని తెలుస్తోంది. సర్‌ ప్రక్రియకు ముందు జిల్లాలో మొత్తం 10,89,090 ఓటర్లుండగా ప్రత్యేక రివిజన్‌ కార్యక్రమం క్రమంలో 9.09లక్షల ఓట్లకు చేరనుంది. సోమవారం ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించనుండగా నియోజకవర్గాల సమగ్ర స్వరూపం వెల్లడవనుంది.

– కరీంనగర్‌ అర్బన్‌/కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement