గంగాధర: గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ పనులకు మోక్షం లభించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, చెరువు కట్ట మరమ్మతు, గ్రావిటీ పనులు, బండ్, మత్తడి పనులకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణపూర్ నిర్వాసితుల కోసం గతంలో రూ.23.50 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం రిజర్వాయర్ పనుల కోసం నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. రిజర్వాయర్ పనులు పూర్తయితే చొప్పదండి నియోజకవర్గంతో పాటు, చుట్టు పక్కల మండలాలకు చెందిన 49,500 ఎకరాలకు సాగు నీరందుతుంది.
సిటీలో పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: 33/11 కే.వీ. టవర్ సర్కిల్ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనులతో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు టవర్ సర్కిల్, రాజీవ్‌చౌక్, భారత్ టాకీస్, రూరల్ పోలీస్‌స్టేషన్, అన్నపూర్ణ కాంప్లెక్స్, సిక్‌వాడీ, బోయవాడ, గంజ్, మార్కెట్ ప్రాంతాలతో పాటు చెట్ల కొమ్మల తొలగింపు, ఏబీ స్విచ్ మరమ్మతులతో ఉద యం 9 నుంచి 11 గంటల వరకు 11కే.వీ.మంకమ్మతోట ఫీడర్ పరిధిలోని ఫైర్‌స్టేషన్, రెండో టౌన్ పోలీస్‌స్టేషన్, ఫాండస్ స్కూల్, విఘ్నేశ్వర హాస్టల్, ఆర్‌బీ స్వీట్ హౌస్, అన్వర్ హోటల్, శ్రీరామ బుక్‌స్టాల్, మోర్ సూపర్ మార్కెట్, గోపాల్‌రావు బిల్డింగ్, వాణి సూపర్ మార్కెట్, జాఫ్రీ మసీదు, జిల్లా గ్రంథాలయం, వాణినికేతన్ కళాశాల ప్రాంతాలు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11కే.వీ.ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరి యా, మానేరునగర్, పద్మనగర్, ప్రగతినగర్, లారెల్ స్కూల్ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు 11కే.వీ. గీతాభవన్ ఫీడర్ పరిధిలోని మంకమ్మతోట, రాంనగర్, పారమిత స్కూల్. రాజీవ్‌పార్క్, జయరాం హాస్పిట ల్, పద్మనగర్, ప్రగతినగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
కరీంనగర్‌కల్చరల్: డీడీఎన్ అర్చకులకు ఉద్యో గ భద్రత కల్పించడంతో పాటు 99వ పీఆర్‌సీని అమలు చేయాలని రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డీడీఎన్ అర్చకులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీడీఎన్ అర్చకుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కళాభారతిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ డాక్టర్ రాజశేఖరరెడ్డి డీడీఎన్ పథకం ప్రారంభించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒకటో తేదీన వేతనాలు అందించడం అర్చకుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దూప దీప నైవేద్యం రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు అన్నవజ్జుల ప్రసాద్ శర్మ, జాక్ కన్వీనర్ డీవీఆర్ శర్మ, ప్రధాన కార్యదర్శి వేగ్గలం సంతోష్ శాస్త్రి, అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యుడు జక్కాపురం నారాయణస్వామి పాల్గొన్నారు.
అవధానం.. మనకు ప్రత్యేకం
కరీంనగర్‌కల్చరల్: తెలుగు వారికే సొంతమైన ప్రత్యేక సాహిత్య ప్రక్రియ అవధానం అని జిల్లా విద్యా శిక్షణ కళాశాల (డైట్) ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గుర్రాల మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎల్‌ఎండీ కాలనీలోని డైట్ కళాశాలలో అవధాన శేఖర, సాహితీ రత్న డాక్టర్ గండ్ర లక్ష్మ ణరావు ఆధ్వర్యంలో శుక్రవారం అష్టావధాన నిర్వహించారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి వెంకట కవుల నుంచి నేటి అవధానుల వరకు అవధాన ప్రక్రియ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుతోందన్నారు. డాక్టర్ గండ్ర లక్ష్మణరావు నిర్వహించిన అష్టావధానం రసరమ్యంగా సాగింది. గాజుల రవీందర్ అప్రస్తుత ప్రసంగం తన చమత్కారాలతో విద్యార్థులను, పండితులను ఆకట్టుకుంది. సముద్రాల వేణుగోపాలచార్య, రాజారాం మోహన్‌శర్మ, డాక్టర్ తత్వాది ప్రమోద్‌కుమార్, సుదర్శనం వేణుశ్రీ, కె.ఎస్.అనంతాచార్య, రామక విఠలశర్మ, శ్రీమతి శ్రీలత, గాజుల రవీందర్ పాల్గొన్నారు.


