యైటింక్లయిన్‌కాలనీ: కాలు విరిగి మంచానికే పరిమితమైన భార్య పరిస్థితి చూసి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన భర్త వేముల ఎల్లయ్య(85) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి యైటింక్లయిన్‌కాలనీ సంతోష్‌నగర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లయ్య భార్య లక్ష్మికి రెండుసార్లు కాలు విరిగింది. కనీసం కదలలేని స్థితిలో ఉంది. నెలరోజులుగా మంచానికే పరిమితమైంది. అయితే, కొంతకాలంగా బీపీ, షుగర్, మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న ఎల్లయ్య.. రోజూ భార్యకు సపర్యలు చేస్తున్నా డు. అప్పుడప్పుడు కూతురు అరుణ వచ్చి ఆలనాపాలనా చూస్తోంది. మంగళవారం ఉదయం కూడా కూతురు వీరి ఇంటికి వచ్చి వంటలు తయారు చేసి తన అత్తగారింటికి వెళ్తూ.. ‘అమ్మ కు మందులు వేయాలి’ అని తండ్రికి చేప్పి పె ద్దపల్లికి వెళ్లింది. భార్య మంచానికే పరిమితం కావడం, తనూ బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పుల తో బాధపడుతూ కుంగిపోయిన ఎల్ల య్య జీ వితంపై విరక్తి చెంది తనఇంటి వరండా లో పైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని వడ్డెరకాలనీకి చెందిన బత్తిని సంతోష్(18) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. గతనెల 30న ఇదే కాలనీకి చెందిన బత్తిని అజయ్, దేవరాజ్‌తోపాటు సంతోష్ కారులో కరీంనగర్ నుంచి ధర్మారం వస్తుండగా అదపు తప్పి ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో సంతోష్ తీవ్రంగా గాయపడగా అజయ్, దేవరాజ్ సైతం గాయపడ్డారు. వీరిని కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అజయ్, దేవరాజ్ కోలుకున్నారు. సంతోష్ చికిత్స పొందుతూ మరణించాడు.
విషాదంలో కుటుంబం..
వడ్డెరకాలనీకి చెందిన బత్తిని మల్లయ్య– మల్లేశ్వరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దకుమారుడు హరీశ్ వారం రోజుల క్రితమే ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. విదేశాల్లో స్థిరపడుతూ కుటుంబానికి అండగా నిలవాలనే పెద్దకుమారిడిపై ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబానికి.. ఇక్కడ ఉన్న చిన్న కుమారుడు సంతోష్ ప్రమాదంలో మృతి చెందడం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒక కుమారుడు విదేశాల్లో ఉండగా, మరొక కుమారుడు శాశ్వతంగా దూరం కావడంతో మల్లయ్య, మల్లేశ్వరి దంపతులు కన్నీరుమున్నీరవున్నారు. తమ్ముడి మరణవార్త తెలియడంతో హరీశ్ దుబాయ్ నుంచి వచ్చే ప్రయత్నంచేస్తున్నట్లు సమాచారం.
అనారోగ్యం భరించలేక వృద్ధుడి బలవన్మరణం
శంకరపట్నం: కన్నాపూర్ గ్రామంలో మంగళవారం అడితం రాజయ్య(70) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజయ్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. వ్యవసాయ పనులు చేసి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు రాజయ్య వేలాడుతూ కనిపించడంతో కిందికి దించారు. కేశవపట్నం పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


