కరీంనగర్: కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌తో డాక్టర్ పేషెంట్ల మధ్య రిలేషన్‌షిప్ దెబ్బతిన్నదని, అందువల్లే డాక్టర్లపై దాడులు పెరిగాయని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్ అన్నారు. ఆదివారం నగరంలోని కేఎస్‌ఎల్ గార్డెన్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జోన్–2 కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ గతంలో వైద్యుడు పేషెంట్ల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండేదన్నారు. అన్ని ఆసుపత్రులలో ఒకే రకమైన ఫీజులు అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఒక్కోరకమైన వైద్య సేవలు అందుతాయని, ఒకే రకమైన ఫీజులు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సంక్షేమ పథకాలను ప్రైవేటు ఆసుపత్రులలో అందించాలని కోరారు. అనంతరం ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్‌ను ప్రకటించారు. కాన్ఫరెన్స్ చైర్మన్ ఎం.ఎల్.ఎన్.రెడ్డి, కో చైర్మన్ పొలాస రామ్‌కిరణ్, ఐఎంఏ జాతీయ రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ రవీంద్రారెడ్డి, ఐఎంఏ స్టేట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ విజయకుమార్, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కె శ్యాంసుందర్, ఎడవల్లి విజయేంద్రరెడ్డి, బి.ఎన్.రావు, ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.అశోక్, కోశాధికారి టి.దయాల్‌సింగ్, ఆర్గనైజింగ్ కన్వీనర్ పొలాస రామ్‌చరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ యూ.రామకృష్ణ కరీంనగర్ ఐఎంఏ అధ్యక్షురాలు శైలజ, కార్యదర్శి ఎన్.మహేశ్‌బాబు, కోశాధికారి నీలిమ, హరికిషన్, ఎనమల్ల నరేశ్, పీవీకే కిషోర్, వసంతరావు, దాసరి శ్రీనివాస్, నవీన, బంగారు స్వామి, రజిని ప్రియదర్శిని పాల్గొన్నారు.


