ఓటుతో భవితకు భరోసా
కరీంనగర్‌అర్బన్: ఎన్నికల వేళ ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ అన్నారు. ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పాలకులను ఎన్నుకోవడంలో ప్రతీ ఓటు కీలకమైందన్నారు. ఈ సందర్భంగా ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
నగరంలో భారీ ర్యాలీ
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి భగత్‌సింగ్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మ హేశ్వర్ ర్యాలీని ప్రారంభించారు. బీసీ సంక్షేమ అధి కారి అనిల్‌ప్రకాష్, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, జిల్లా యువజన అధికారి రాంబాబు, కరీంనగర్ క్రీడా పాఠశాల విద్యార్థులు, స్కౌట్, గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.


