ముగిసిన మొబిలైజేషన్ పరేడ్
కరీంనగర్‌క్రైం: కమిషనరేట్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వార్షిక డీ–మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమం ఆదివారం ముగిసింది. సీపీ గౌస్ ఆలం హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇలాంటి శిక్షణ తరగతులు పోలీసుల్లో మరింత నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయన్నారు. వివిధ రకాల తుపాకుల వినియోగం, ఖైదీలను కోర్టులకు, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు, అత్యవసర సమయాల్లో గురి తప్పకుండా ఫైరింగ్ చేసే విధానంపై శిక్షణ అందించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఆర్‌ఐ రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పీపీఈటీల సమస్యల పరిష్కారానికి కృషి
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లాలోని ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. పీపీఈటీల సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న నిర్వహించే క్రికెట్ లీగ్ పోటీల వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుతం క్రీడలకు ఆదరణ పెరిగిందని, విద్యార్థులు క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు నందెల్లి మహిపాల్, అధ్యక్ష, కార్యదర్శులు బత్తిని శ్రీధర్‌గౌడ్, దారం గౌతమ్‌రెడ్డి, కోశాధికారి కంకటి అనూప్‌కుమార్, ముఖ్య సలహాదారు సిలివేరి మహేందర్, ఆనంద్, మహిపాల్, ముఫాజిల్, స్వామి, ప్రశాంత్, రవి, శివ, నరేందర్, జీవన్, రవికుమార్, షరీఫ్, శ్రీధర్, రాజు, అంజి, ప్రశాంత్, రాకేశ్, మనీ, వినయ్, సుశీల్, మహేందర్, శ్రీనివాస్‌నాయక్, రాజేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డ్రైవింగ్ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
కరీంనగర్: ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని జిల్లా రవాణా అధికారి శ్రీకాంత్‌చక్రవర్తి అన్నారు. జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్ బస్టాండ్ ఎదుట రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఏ వాహనం నడపాలన్నా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నారు. పరిమితికి మించి ప్యాసింజర్లను తీసుకెళ్తే చట్టరీత్యా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ట్రాన్స్‌పోర్ట్ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా పర్మిట్ తీసుకోవాలని సూచించారు. ఏఎంవీఐ స్రవంతి, రవాణాశాఖ కానిస్టేబుళ్లు, హోంగార్డ్‌లు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి
కరీంనగర్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం ఎన్నో పోరాటాలు చేసిన సీపీఐని ప్రజలు ఆదరించాలని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, న్యాలపట్ల రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, గామినేని సత్యం, మాడిశెట్టి అరవింద్, బాకం ఆంజనేయులు, కూన రవి, నేదునూరి లక్ష్మణ్, రాములు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన మొబిలైజేషన్ పరేడ్
ముగిసిన మొబిలైజేషన్ పరేడ్
ముగిసిన మొబిలైజేషన్ పరేడ్


