అమ్మ.. ఇప్పుడే వస్తా..
‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చెప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇప్పుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మరో యువకుడి తల్లిదండ్రులు సైతం చేతికందిన కొడుకు ఇక లేడని గుండెలవిసేలా రోదించారు.
కరీంనగర్‌క్రైం/వీణవంక: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్‌బోర్డుకాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందగా, వారి తల్లిదండ్రుల రోదనలు మి న్నంటాయి. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మ్యాకల గణేశ్(22), అదే గ్రామానికి చెందిన మిరియాల సందీప్‌రెడ్డి(20)తో పాటు మరో స్నేహితుడు వేర్వేరు బైక్‌లపై గణేశ్ బైక్ స్పేర్ పార్ట్స్ కోసం మధ్యాహ్నం కరీంనగర్ వచ్చారు. అనంతరం గణేశ్, సందీప్‌రెడ్డి బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో రోడ్డు క్రాస్ చేస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొని బైక్‌పై నుంచి ఎగిరిపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించే క్రమంలో ఇద్దరూ మృతిచెందారు. మృతుడు గణేశ్ తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.తిరుమల్ తెలిపారు.
మామిడాలపల్లిలో విషాదం
కరీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో స్వగ్రామం వీణవంకలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మ్యాకల కొమురయ్య–పద్మ దంపతులకు గణేశ్‌తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గణేశ్ ఇంటర్‌లోనే చదువు మానేసి ఇంటి వద్దే వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. మిరియాల శ్రీనివాస్‌రెడ్డి–మమత దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సందీప్‌రెడ్డి. ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఒక్కడే కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. చేతికొచ్చిన కొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.
గణేశ్ (ఫైల్)
సందీప్‌రెడ్డి (ఫైల్)
స్కూల్ బస్సును ఢీకొట్టిన బైక్
ఇద్దరు స్నేహితుల దుర్మరణం
బైక్ పార్ట్స్ కోసం వచ్చి.. కడుపుకోత మిగిల్చి..
చేతికందిన కొడుకులను కోల్పోయి తల్ల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
అమ్మ.. ఇప్పుడే వస్తా..


