అభివృద్ధి..సంక్షేమం
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
ప్రజలకు సందేశం ఇస్తూ..
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ఆలం
పాఠశాలలకు నిధులు
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతు ల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి పాఠశాలల గ్రాంటును రెండో విడతగా అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాల్లో జమచేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 651 పాఠశాలల నిర్వహణకు రూ.77,44,500ను విడుదలయ్యాయి. 651 స్కూళ్లకు రూ.62,97,500, 16 ఎమ్మార్సీలకు రూ.7,20,000, 14 సీఆర్సీ లకు రూ.7,26,000 కేటాయించారు. పాఠశాల హెచ్‌ఎం, ఏఎంసీ కమిటీ అధ్యక్షుడి పేరున ఉన్న జాయింట్ ఖాతాలో ఈ నిధులు జమవుతాయి. వచ్చిన నిధులతో పాఠశాలల మరమ్మతు, ప్రయోగశాలలకు పరికరాలు, విద్యుత్ బిల్లులు, పరీక్షలు, జాతీయ పండగల నిర్వహణ, కంప్యూటర్ల మరమ్మతులు, టీవీ, ఆర్‌వోటీ, డిజిటల్ తరగతుల నిర్వహణ, ఉపాధ్యాయుల వర్క్‌షీట్లకు వినియోగించుకోవచ్చు.
ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలి
కరీంనగర్‌టౌన్: ప్రజాస్వామ్య వాదులు ఏకం కావాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద జాతీయ జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి ఎగురవేశారు. కార్యకర్తలు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, మచ్చ రమేశ్ పాల్గొన్నారు.
కొత్తపల్లి: విద్యుత్ పనులు చేపడుతున్న మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.బ్యాంక్‌కాలనీ ఫీడర్ పరిదిలోని వావిలాలపల్లి, గుండుహనుమాన్, పోచమ్మ దేవాలయం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
కరీంనగర్‌స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా వాలీబాల్ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న అంబేద్కర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి సబ్‌జూని యర్స్ అండర్–16 బాలబాలికల జట్ల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వేణు కిషన్ రావు, గిన్నె లక్ష్మణ్ తెలిపారు. రాణించినవారిని ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు నిజామాబాద్‌లోని కమ్మార్‌పల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్న ట్లు తెలిపారు. క్రీడాకారులు 1 జనవరి 2010 తరువాత జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు మధ్యాహ్నం 2గంటలకు నగునూర్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
భరతమాత వేషధారణలో విద్యార్థిని
జెండా వందనం చేస్తున్న సీపీ గౌస్ ఆలం, పోలీసులు
పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం
ఎస్‌యూలో జెండా ఆవిష్కరిస్తున్న వీసీ ఉమేశ్‌కుమార్
కరీంనగర్ క్రైం: జిల్లా కోర్టులో పాల్గొన్న జడ్జి శివకుమార్
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్:
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూనే ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్నామని కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, విద్య, వైద్యం, వ్యవసాయం, పేదరిక నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన చివరి లబ్ధిదారు వరకు పారదర్శకంగా అమలుచేస్తామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 239 బస్సుల ద్వారా మహిళలు రూ.278 కోట్ల లబ్ధి పొందారన్నారు. గృహజ్యోతి పథకంలో రూ.5,26,000 సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందన్నారు. 1,56,083 మంది లబ్ధిదారులకు 5,32,066 సిలిండర్లు రూ.500కే ఇవ్వడం జరిగిందన్నారు.
79,541 మంది రైతులకు రూ.622 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా ద్వారా వానాకాలం సీజన్ 1,90,186 మంది రైతులకు రూ.206,62,96,000 ఖాతాల్లో జమ చేశామన్నారు. యాసంగికి 41,897 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. రైతు బీమా ద్వారా రూ.8.80 కోట్ల బీమా సొమ్ము అందించామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 2024–25లో ఇంటిస్థలాలు ఉన్న 11,575 మందికి ఇళ్లు కేటాయించామన్నారు. జనవరి నాటికి 6,059 నివాసాలకు రూ.128.88 కోట్లు చెల్లించామన్నారు.
వానాకాలం సీజన్‌లో 322 కొనుగోలు కేంద్రాలు ద్వారా 3.33లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రైతులకు రూ.795.67 కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. 3,18,436 రేషన్ కార్డులకు 5,600 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
గతేడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,453 ప్రసవాలు జరిగాయని అన్నారు. ఆరోగ్య మహిళా ద్వారా 3,17,541 మందికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయన్నారు. రూ.1,09,548 మంది మహిళలు రెండోసారి సేవలు పొందారని వివరించారు.
విద్యాశాఖలో బ్రిక్స్ టు బుక్స్, విద్యా వాహిని, వాయిస్ ఫర్ గర్‌ల్స్, కాన్షియెనసెస్ క్లబ్స్, టెడ్ ఎడ్ టాక్స్, బుధవారం బోధన, ఇంగ్లిష్ క్లబ్, విటమిన్ గార్డెన్స్ వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డెంటల్ వైద్యులతో 21,581 మంది విద్యార్థులకు పంటి పరీక్షలు నిర్వహించామని అన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 634 స్వయం సహాయక సంఘాలకు రూ.684.61 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 11,401 సంఘాలకు రూ.37.81 కోట్ల వడ్డీ లేని రుణాలు, 1,34,778 మందికి ప్రతినెల రూ.31.67 కోట్ల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు.
మెప్మా ద్వారా 771 స్వయం సహాయక సంఘాలకు రూ.12.17 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 301 వ్యక్తిగత యూనిట్లకు రూ.7.78 కోట్లు మంజూరు చేశామన్నారు. 37 గ్రూపు యూ నిట్లకు రూ.3.11 కోట్లు మంజూరు చేశామని వివరించారు.
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధులశాఖ ద్వారా 777 అంగన్వాడి కేంద్రాల్లో 53,532 మందికి గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అందిస్తున్నామని, విద్యార్థులు వేధింపులకు గురైతే ఫిర్యాదు కోసం ప్రతీ ఉన్నత పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశామన్నారు.
మత్తు పదార్థాల నిర్మూలనకు 328 పాఠశాలలు, కళాశాలల్లో కాన్షియస్నెస్ క్లబ్బులు ఏర్పాటు చేసి 28,690 మందికి అవగాహన కల్పించామని, కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన 10 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలు, అథ్లెటిక్స్ పోటీల్లో 4 పతకాలు కై వసం చేసుకున్నారని వివరించారు. వేడుకల్లో చొప్పదండి ఎమెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరెందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, అదనపు కలెక్టర్ అశ్వినితానాజీ వాకడే, ఆర్‌డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
కరీంనగర్‌కల్చరల్: వివిధ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. జవహర్ బాలభవ న్, కేజీవీబీ తిమ్మాపూర్, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ రుక్మాపూర్, రీజినల్ స్పోర్ట్స్ స్కూల్, కేజీవీబీ రామడుగు విద్యార్థుల నృత్యాలు వీక్షకులను అలరించాయి.
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం
అభివృద్ధి..సంక్షేమం


