వైభవంగా ఎదుర్కోలు
కరీంనగర్ మార్కెట్ రోడ్డు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి ఎదుర్కోలు వైభవంగా సాగాయి. సాయంత్రం శ్రీవారు అశ్వవాహనంపై, అమ్మవార్లు గజవాహనంపై బయల్దేరి ప్రకాశం గంజ్‌లోని వరసిద్ధి వినాయక ఆలయానికి చేరుకున్నారు. వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్, సుడాచైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నేడు శ్రీవారి కల్యాణం వైభవంగా జరగనుంది. ఉదయం వేంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనంపై మాడ వీధుల్లో విహరించారు. కరీంనగర్ నగర పద్మశాలీ సంఘం తరఫున నగర అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం, గౌరవ అధ్యక్షుడు వాసాల రమేశ్, పోలు సత్యనారాయణ, దేవసాని పాపన్న, మోర రాజేశం తదితరులు పద్మావతి అమ్మవారికి పుట్టింటి కానుకగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, సారె సమర్పించారు. ఈవో కె.సుధాకర్, ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, గంగాధర్ పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. –కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్‌టౌన్
ఆలయంలో హోమం
ఆకట్టుకున్న చిన్నారుల నృత్యం
సారె తీసుకొస్తున్న పద్మశాలీలు
వైభవంగా ఎదుర్కోలు
వైభవంగా ఎదుర్కోలు
వైభవంగా ఎదుర్కోలు
వైభవంగా ఎదుర్కోలు


