రాజకీయాలకతీతంగా బ్రహ్మోత్సవాలు
కరీంనగర్‌కల్చరల్: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్డు వేంకటేశ్వరాలయం బ్రహ్మోత్సవాలను రాజకీయాలకతీతంగా ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం స్వామివారిని దర్శించుకొని మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దాతల సహకారంతో సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.
సమ్మక్క జాతరకు 4 వేల బస్సులు
ఈనెల 28 నుంచి 31 వరకు సమ్మక్క– సారలమ్మ జాతరకు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లోని 51 కేంద్రాల నుంచి బస్సు సౌకర్యాలు కల్పించామని, జాతర కో సం ఆర్టీసీ 4 వేల అదనపు బస్సులు నడుపుతుంద ని పేర్కొన్నారు. జాతరలో పిల్లలు తప్పిపోకుండా పోలీస్‌శాఖ క్యూ ఆర్ కోడ్ తీసుకొచ్చిందని, దీనిని అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు.
ఫోన్ ట్యాపింగ్‌పై..
ఫోన్ ట్యాపింగ్‌పై తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రజాప్రతినిధులు ప్రమేయం లేదన్నారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. సుడా చైర్మన్ కోమటిరె డ్డి నరేందర్‌రెడి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు.
ఉత్సవ కమిటీ నియామకం
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్సవ కమిటీని నియమించింది. సిరిపురం మనోజ్‌కుమార్, కోమండ్ల శిరీష, చందా లక్ష్మీనారాయణ, తోట రాజేందర్, వంగల విద్యాసాగర్, మిట్ట కుమారస్వామి, చెప్యాల రాజిరెడ్డి, ఉప్పల బాలాజీ, కూన దామోదర్, ఎనుగుర్తి రమేశ్, గోనే స్వప్నను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


