తొలిదశలోనే గుర్తిస్తే ఫలితం
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కీమోథెరపీ సేవలు ప్రారంభించినప్పటి నుంచి పేషెంట్లు వస్తున్నారు. ఆరోగ్యమహిళ కార్యక్రమం ద్వారా గుర్తించిన కేన్సర్ అనుమానితులను జీజీహెచ్‌కు పంపిస్తుండడంతో వారికి మామోగ్రామ్, పాపియర్, ఇతర పరీక్షల ద్వారా కేన్సర్‌ను నిర్ధారిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ చేసి కేన్సర్ ఉంటే కీమోథెరపి చేస్తున్నాం. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్సతో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రతీఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
– డాక్టర్ వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్


