రూ.26.4 కోట్లు తాగేశారు!
కరీంనగర్‌క్రైం: నూతన సంవత్సరం పేరిట మద్యం ప్రియులు తెగతాగేశారు. వేడుకల సందర్భంగా రూ.26.4 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా కరీంనగర్ టౌన్‌లో 21, రూరల్‌లో 24, తిమ్మాపూర్ సర్కిల్ 14, హుజురాబాద్ సర్కిల్ 17, జమ్మికుంట సర్కిల్‌లో 16 మద్యం దుకాణాలు ఉన్నాయి. దీంతో పాటు 33 బార్లు ఉండగా వీటన్నింటిలో కలిపి కొత్త సంవత్సరం సందర్భంగా సుమారు రూ.26.4 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. 36,440 కాటన్ల మద్యం, 38,661 కాటన్ల బీర్లు కేవలం నయా జోష్‌లోనే మద్యం ప్రియులు తాగేశారు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినా తగిన జాగ్రత్తలు తీసుకొని మరి కుమ్మేయడంతో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది.


