రికార్డులన్నీ సమర్పించాలి
చిగురుమామిడి(హుస్నాబాద్): పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు చేపట్టిన పనులకు సంబంధించి పూర్తిస్థాయి రికార్డులు ఇవ్వనందున డీఆర్‌డీవో శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో 16వ విడత ఈజీఎస్, సామాజిక ప్రజావేదిక సదస్సును ఎంపీడీవో విజయ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో మాట్లాడుతూ, వచ్చే సోషల్ ఆడిట్‌లోపు పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి పనుల రికార్డులు మొత్తం సబ్‌మిట్ చేయాలని ఆదేశించారు. రూ.46,039 వేల విలువగల పనుల ప్రొసీజర్ ల్యాప్స్ అయ్యాయని, ఇలాంటివి పునరావృతం కావొద్దన్నారు. అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రెడ్డి, అంబుడ్స్‌మెన్ లక్ష్మీనారాయణ, ఎస్‌ఆర్‌పీ తిరుపతి పాల్గొన్నారు.


