పోలీసులకు సేవా పతకాలు
కరీంనగర్‌క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే శౌర్య, మహోన్నత, ఉత్తమ, కఠిన సేవ, సేవా పతకాలను అధికారికంగా ప్రకటించింది. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ, అంకితభావం, అసమానమైన సేవలందించిన అధికారులకు గౌరవం దక్కింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది పెద్ద సంఖ్యలో పతకాలు సాధించి కమిషనరేట్ కీర్తిని చాటారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావుకు మహోన్నత సేవా పతకాలు వచ్చాయి. ఉత్తమ సేవా పతకాలు వచ్చినవారిలో సీటీసీ ఎస్సై, ఎస్‌బీ ఎస్సై ఎస్.శ్రీనివాస్, సీసీఆర్‌బీ హెడ్‌కానిస్టేబుల్ ఇ.చుక్కారెడ్డి ఉన్నారు. కఠిన సేవాపతకాలు వచ్చినవారిలో హుజురాబాద్ టౌన్ సీఐ టి.కరుణాకర్, ఎస్‌బీ సీఐ వి.శ్రీనివాస్, వన్‌టౌన్ ఎస్సై ఎ.సత్యనారాయణ, ఏఎస్సైలు ఖాజాజమాలుద్దీన్, సయ్యద్‌పాషా, టి.మనోజ్‌కుమార్, ఆర్.సమ్మయ్య, ఎన్.దామోదరచారి, గోలాడ సదయ్య, ఎండీ అంకుషావలి, హెడ్‌కానిస్టేబుళ్లు పి.శ్రీనివాస్, పి.చంద్రమౌళి, పి.శ్రీరాములు, బి.అంజయ్య, ఇ.తిరుపతి, ఎండీ ఖాజాఅజీముద్దీన్, టి.కై లాస్‌సింగ్, బి.రవీందర్‌రెడ్డి, సీహెచ్ ఆంజనేయులు, ఎస్.రామచందర్, ఎం.మల్లయ్య, ఎండీ సుల్తాన్ సలావుద్దీన్ ఉన్నారు. కానిస్టేబుళ్లలో పి.కొమురయ్య, బి.సత్యనారాయణ, జి.అంజయ్య, కె.లింగారెడ్డి పతకాలు సాధించారు. పతకాలు సాధించిన అందరినీ సీపీ గౌస్ ఆలం అభినందించారు.
ఎస్.శ్రీనివాస్
ఎస్సై
వెంకటరమణ, అద నపు డీసీపీ (అడ్మిన్)
భీంరావు, అదనపు డీసీపీ (ఏఆర్)
పోలీసులకు సేవా పతకాలు
పోలీసులకు సేవా పతకాలు


