
ఫొటోగ్రాఫర్లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
● ఫొటో, వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే హుస్సేన్
సుల్తానాబాద్(పెద్దపల్లి): మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫొటో, వీడియోగ్రాఫర్లు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని ఫొటో, వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే హుస్సేన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ వేడుకల్లో ఆయన మాట్లాడారు ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కుటుంబ భరోసా పథకం ప్రవేశపెట్టామని, దీనిద్వారా ఇప్పటివరకు చనిపోయిన 140 కుటుంబాలకు రూ.2 కోట్లపైగా సాయం చేశామన్నారు. రామగుండం అసోసియేషన్ సభ్యుడు కడమంచి దినేశ్ సంబంధించిన రూ.4,20,000 విలువైన చెక్కును అసోసియేషన్ బాధ్యులకు అందించారు. జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సిరి రవి, రాజేశ్‌రెడ్డి, మహిమాల కేదార్‌రెడ్డి, తుమ్మ చందు, మధు, అప్పాసు రామన్న, శ్వాస తిరుపతి, ముక్కెర శ్రీనివాస్, ఎండీ ఇర్ఫాన్, అల్లం సతీశ్, వనపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.