
సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని ఉప్పరిపేటలో కొత్తగా నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంకులో అనుష్మాన్ మణీశ్వర్ (3) ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్, మన్విర్ యునోలి దంపతులకు ఇద్దరు కుమారులు. కొద్దికాలంగా జగిత్యాలలో ఉంటూ మేసీ్త్ర పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఉప్పరిపేటలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా వెంట ఉన్న చిన్నకుమారుడు అనుష్మాన్ మణీశ్వర్ ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డాడు. వెంటనే గమనించిన వారు నీటి నుంచి బయటకు తీసే సరికి మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు.
హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేక..
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న చేతన్ అనే 6వ తరగతి విద్యార్థి హాస్టల్‌లో ఉండడం ఇష్టంలేక శుక్రవారం లారీ కింద దూకబోయాడు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్ గమనించి అప్రమత్తమై బాలున్ని రక్షించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్సై బాలున్ని విచారించగా.. ఈ వినాయక చవితి సమయంలో ఇంటి వద్దే ఉండాలని ఉందని, హాస్టల్‌లో ఉండలేనని రోదిస్తూ చెప్పాడు. వెంటనే పోలీసులు చేతన్‌ను స్టేషన్‌కు తరలించారు. పట్టణ సీఐ కరుణాకర్ బాలుడి తండ్రిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు.