
చాలీచాలని వేతనాలు !
● పర్మినెంట్ కాని ఉద్యోగాలు ● 14 ఏళ్లుగా ఎదురుచూపులే ● ఆందోళనలో ఐఈఆర్‌పీలు
వేములవాడరూరల్: చాలీచాలని వేతనాలతో ఏళ్లుగా పనిచేస్తున్నారు. దివ్యాంగులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న వారిపై ప్రభుత్వాలకు చిన్నచూపే. ఏళ్లుగా విధులు నిర్వరిస్తున్నా వేతనాలు పెరగక.. ఉద్యోగాలు పర్మినెంట్ కాక ఐఈఆర్పీలు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు రాజీవ్ విద్యా మిషన్‌గా ఉండే వీరిని ప్రత్యేక ఉపాధ్యాయులుగా పిలిచేవారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్(ఐఈఆర్‌టీ) ఇప్పుడు సర్వశిక్ష అభియాన్‌గా మారింది. భవిత సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్(ఐఈఆర్‌పీఎస్)ల సేవలు మరువలేనివి. చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న వీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నవించారు. స్పందించిన సీఎం వెంటనే సమస్య పరిష్కరిస్తానని మనోధైర్యం కల్పించారు. కానీ ఇప్పటి వరకు వారికిచ్చిన హామీ మాత్రం అమలుకు నోచుకోలేదు.
13 భవిత సెంటర్‌లు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 13 భవిత సెంటర్‌లు ఉన్నాయి. అందులో 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి గత 14 ఏళ్లుగా వేతనాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 2014 నుంచి 2019 వరకు రూ.15వేలు ఉన్న వేతనాన్ని 2019 నుంచి ఒక్కరోజు జాబ్‌తో రెన్యూవల్ చేసి రూ.19,550 ఇస్తున్నారు. జిల్లాలో 13 భవిత కేంద్రాలు ఉండగా ఇందులో 10 మంది విద్యాబోధన చేస్తున్నారు. ఇందులో విద్యార్థులు 594 మంది ఉన్నారు. చాలా మంది పూర్తిగా అంగవైకల్యం ఉండి భవిత కేంద్రాలకు రాలేని పిల్లల ఇంటికి వెళ్లి ఫిజియోథెరపీ, ఇతర శిక్షణ అందించిన సంఘటనలు ఉన్నాయి. సిరిసిల్ల, గంభీరావుపేట, వేములవాడ అర్బన్ మండలాల్లో సొంత భవనాలు ఉన్నాయి. చందుర్తి, వేములవాడరూరల్, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, రుద్రంగి, బోయినపల్లి, ఇల్లంతకుంట, కోనరావుపేట, తంగళ్లపల్లి మండలాల్లో ప్రభుత్వ బడుల్లోనే ఒక గదిలో భవిత కేంద్రాలు కొనసాగుతున్నాయి.
ఇవీ డిమాండ్లు..