
ఖమ్మంపల్లిలో మహిళకు డెంగీ
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన అక్కపాక రాజేశ్వరికి డెంగీ పాజిటివ్ రావడంతో జిల్లా మలేరియా అధికారి శ్రీరాము లు, స్థానిక ప్రభుత్వ వైద్యుడు అమరేందర్‌రావు, సిబ్బంది శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. తీవ్రజ్వరంతో ఈనెల 19న కరీంనగ ర్ ప్రభుత్వ అస్పత్రిలో చేరగా.. డెంగీ పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. వైద్యాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటా వైద్య పరీక్షలు చేశారు. 12 మంది రక్తనమూనాలు సేకరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య సిబ్బంది లావణ్య, రమాదేవి, శ్రీనివాస్, శృతి, దుర్గ, సరిత, పంచాయతీ కార్యదర్శి బద్రు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని దివ్యాంగుడు మృతి
రాయికల్(జగిత్యాల): మండలంలోని అల్లీపూర్ గ్రామంలో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొని దివ్యాంగుడు బి.రాజేందర్ (32) మృతిచెందాడు. ఎస్సై సుధీర్‌రావు తెలిపిన వివరాలు.. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొత్తపేట గ్రామానికి వెళ్తున్న క్రమంలో అల్లీపూర్‌లో రాజేందర్ రోడ్డు దాటుతుండగా ఢీకొంది. ఈ ప్రమాదంతో రాజేందర్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం వరంగల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ సారయ్యపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పోచమ్మ ఉత్సవాల్లో విషాదం
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణం పురాణిపేటలోని లోకమాత పోచమ్మతల్లి ఆలయంలో జరుగుతున్న 63వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. పోచమ్మవాడకు చెందిన భక్తుడు క్యాసం వెంకన్న (65) భోజనం చేసేందుకు అన్నదానం వద్ద సిద్ధమవుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కిందపడ్డాడు. స్థాని కులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు.
దర్జీ బలవన్మరణం
కోనరావుపేట(వేములవాడ): అనారోగ్య బాధలు భరించలేక ఓ టైలర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన బోయిని మల్లేశం(58) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. తన అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్ రాసి ఉరివేసుకున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

ఖమ్మంపల్లిలో మహిళకు డెంగీ

ఖమ్మంపల్లిలో మహిళకు డెంగీ