ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

Aug 21 2025 6:58 AM | Updated on Aug 21 2025 6:58 AM

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

● గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్‌ బలోపేతం ● ఉమ్మడి జిల్లా ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ప్రణాళికాబద్ధంగా జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన తుమ్మల మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల పురోగతికి చర్యలు చేపట్టామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. రైతుబజార్లను విస్తరించాలని, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, పంటల నష్ట పరిహారం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మైనార్టీ, మహిళల అభివృద్ధికి పథకాలను పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, మేడిపల్లి సత్యం, సంజయ్‌, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, నియోజక వర్గ ఇన్‌చార్జిలు వొడితెల ప్రణవ్‌, కేకే.మహేందర్‌రెడ్డి, జువ్వాడి నర్సింగరావు, నాయకులు వెలిచాల రాజేందర్‌రావు, వూట్కూరి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement