
లక్ష్య సాధనలో బ్యాంకర్లు సహకరించాలి
కరీంనగర్ అర్బన్: వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం జీపీవై, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో బుధవారం సమీక్షించా రు. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2024 నుంచి జూన్ 2025 వరకు రూ.4,314.88 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1,591.41కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.1,186.38కోట్లు, విద్యా రుణాల కు రూ.3.38కోట్లు, హౌసింగ్ లోన్స్ రూ.57.24కోట్లు, స్వయం సహాయక సంఘాల రుణాలు రూ.258 కోట్లు, ఇ తర రంగాలకు రూ.1218.47 కోట్లు రుణాలను మంజూరు చేసినట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న లక్ష్యాల్లో జూన్ 30వరకు 32.12 శాతం పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న రుణాల ప్రతిపాదనలు అందించి త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు. జూలై 1నుంచి జన సురక్ష శిబిరాలు జిల్లాలో ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, ఆర్‌బీఐ అధికారి తాన్య, నాబార్డ్ డీడీఎం జయప్రకాశ్, ఎస్‌బీఐ ఏజీఎం వెంకటేశ్, టీజీబీ ఆర్‌ఎం బాలనాగు పాల్గొన్నారు.