సైదాపూర్/హుజూరాబాద్/చిగురుమామిడి: కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అశ్వినీ తానాజీ వాకడే ఆదేశించారు. సైదాపూ ర్, హుజూరాబాద్, చిగురుమామిడిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. హుజూరాబాద్‌లో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మరమ్మతు పనులు పరిశీలించారు. విద్యార్థులకు స్టాఫ్‌క్లబ్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులు పంపిణీ చేశారు. మున్సిప ల్ కమిషనర్ సమ్మయ్యతో కలిసి మొక్క నాటా రు. చిగురుమామిడిలో విద్యార్థులతో మాట్లా డి, సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు.
రాజీవ్ గాంధీకి నివాళి
కరీంనగర్ కార్పొరేషన్: దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నగరంలోని డీసీసీ కార్యాలయం, రాజీవ్‌చౌక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ కార్పొరేటర్లు మాచర్ల ప్రసాద్, కట్ల సతీష్, పడిశెట్టి భూమయ్య, నాయకులు ఎండీ.తాజొద్దీన్, కొరివి అరుణ్‌కుమార్, శ్రావణ్‌నాయక్, కర్ర రాజశేఖర్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు
హుజూరాబాద్ : రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణానికి చెందిన బీజేపీ ముఖ్య నాయకులు బుధవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే పార్టీ కుండవా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన తీరును చూస్తున్న ప్రజలు, వివిధ పార్టీల నేతలు కేసీఆర్ నాయకత్వమే మేలు చేస్తుందని స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. హుజూరాబాద్ రాజకీయాల్లో మరో మలుపు నమోదైందని, స్థానిక సంస్థల ఎన్నికలో పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరినవారిలో జూపాక సింగిల్ విండో చైర్మన్ అనుమళ్ల శాముందర్‌రెడ్డి, కట్కూరి మల్లారెడ్డి, కట్కూరి కోమల్‌రెడ్డి, రాజిరెడ్డి ఉన్నారు.
భవిష్యత్ కార్యాచరణ కోసమే మహాసభలు
కరీంనగర్: గతాన్ని సమీక్షించుకుని, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం కోసమే సీపీఐ రాష్ట్ర మహాసభలని పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు జరిగే మహాసభలకు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అధ్వర్యంలో జిల్లా ప్రతినిధులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మహాసభల్లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వివిధ సమస్యలపై చర్చించి తీర్మాణాలు చేయనున్నామని, మూడేళ్లుగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు, పార్టీ, ప్రజాసంఘాల పని విధానంపై సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, అందె స్వామి, బోయిని, అశోక్,గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కళాశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కళాశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలి