
యూరియా తెచ్చే సోయి లేదా?
తిమ్మాపూర్: మానకొండూర్ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. యూరియా కొరతను నిరసిస్తూ బుధవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో సొసైటీ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికై నా రైతులకు సరిపడా యూరియా అందించాలని, లేనిపక్షంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణరావు, మండలాధ్యక్షుడు రావుల రమేశ్, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, ల్యాగాల వీరారెడ్డి, గంప వెంకన్న, పాశం అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.